సీఎం దృష్టికి గల్ఫ్ సమస్యలు
26-05-2024 02:01 AM
రాజన్న సిరిసిల్ల, మే 25 (విజయక్రాంతి): యూఏఈ పర్యటనలో గల్ఫ్ కార్మికుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకున్నానని, వాటిని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వారంపాటు యూఏఈలో పర్యటించిన ఆది శుక్రవారం పర్యటన ముగించుకొని నేరుగా రేవంత్ నివాసంలో సీఎంను కలిశారు. గల్ఫ్ కార్మికుల సమస్యలు, గల్ఫ్ చట్టాలపై అవగాహన తదితర అంశాలపై సీఎంకు తెలిపినట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుతం గల్ఫ్ కార్మికులకు అండగా ఉంటుందని సీఎం తెలిపారన్నారు. తరలోనే శాశత పరిష్కారం లభిస్తుందని వివరించారు.






