calender_icon.png 18 August, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన గల్ఫ్ బాధితుడు

06-10-2024 02:16:13 AM

హైదరాబాద్, అక్టోబర్ 5(విజయక్రాంతి): ఒం టెల కాపరిగా కష్టాలు అనుభవించిన గల్ఫ్ బాధితు డు రాథోడ్ నాందేవ్ శనివారం తన కుటుంబ సభ్యులతో సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం రూవికి చెందిన రాథోడ్ నాందేవ్ ఇంటి పని వీసాపై కువైట్ వెళ్లాడు. అక్కడ అరబ్బు యజమాని అతడిని అక్రమంగా సౌదీకి పంపించాడు.

సౌదీలో ఒంటెల కాపరి పని చేయించాడు. ఈ క్రమంలోనే తాను యజమాని హింసను భరించలేకపోతున్నానని, నిత్యం నరకం అనుభవిస్తు న్నానని, సీఎం రేవంత్ రెడ్డి తనను రక్షించాలంటూ విలపిస్తూ ఒక సెల్ఫీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. సీఎం దృష్టికి వెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. తెలంగాణ జీఏడీ ఎన్నారై శాఖ అధికారులు కువైట్, సౌదీ అరేబియా దేశాల్లోని ఇండియన్ ఎంబసీలు, ఎన్‌జీఓలు, ఢిల్లీలోని విదేశాంగ శాఖతో సమన్వయం చేసి నాందేవ్ హైదరాబాద్ వచ్చేలా చేశారు.