18-08-2025 08:11:57 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): గోల్కొండ మహారాజ్ శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి సందర్భంగా రేకుర్తిలోని 19వ డివిజన్ లో జగిత్యాల మెయిన్ రోడ్ లో ఉన్న సర్వాయి పాపన్న విగ్రహనికి కరీంనగర్ నగర మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు, కార్పొరేటర్లు కోటగిరి భూమా గౌడ్, గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, భారత రాష్ట్ర సమితి రాష్ట్ర సీనియర్ నాయకురాలు పావని గౌడ్, మాజీ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేష్ గౌడ్, గౌడ సంఘం మాజీ అధ్యక్షులు గుర్రం శ్రీనివాస్ గౌడ్ పూల మాలలతో నివాళులు అర్పించారు. అనంతరం 18వ డివిజన్ మాజీ కార్పోరేటర్ సుదగోని.మాధవి-కృష్ణగౌడ్ మాట్లాడుతూ... సర్వాయి పాపన్న జయంతి వేడుకలు రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన ప్రజాప్రతినిధులకు తోటి కుల బాంధవులకు కృతజ్ఞతలు తెలిపారు.