calender_icon.png 18 August, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ నెల 19న జాతీయ రక్త వీర అవార్డును ఢిల్లీలో అందుకోబోతున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు

18-08-2025 08:25:20 PM

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ (ఐవిఎఫ్)ల సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం రెండు సంవత్సరాల కాల వ్యవధిలో నాలుగువేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి కావాల్సిన రక్తాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందజేస్తున్నందుకు గాను జాతీయ స్థాయిలో రక్తవీర్ పురస్కారాల ఎంపిక చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గడిచిన 18 సంవత్సరాలుగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తూ ఇప్పటివరకు 25వేల యూనిట్ల రక్తాన్ని సేకరించడం జరిగింది.

2023 నుండి నేటి వరకు తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం 4 యూనిట్ల రక్తాన్ని సేకరించడం సంవత్సర కాలంలో 2306 యూనిట్ల రక్తాన్ని సేకరించి భారతదేశంలోనే ఈ ఘనతను సాధించిన సంస్థగా కామారెడ్డి రక్తదాతల సమూహం ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిలిచి ప్రతిష్టాత్మకమైన ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు చోటు దక్కించుకోవడం జరిగిందని కామారెడ్డి రక్తదాతల సమూహం ఉపాధ్యక్షులు&ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు పరుష వెంకటరమణ బాతెలియజేశారు.

ఈ పురస్కారం ఈ నెల 19 న అందుకోవడానికి సహకరించిన రక్తదాతలకు ,రక్తదాన శిబిరాలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన దాతలకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు భవిష్యత్తులో తల సేమియా వ్యాధి చిన్నారుల కోసం మరిన్ని మెగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేసి వారి ప్రాణాలను కాపాడుతామన్నారు ఈ అవార్డు ఎంపికకు సహకరించిన జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, ఐ వి ఎఫ్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గంజి రాజమౌళి గుప్త, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉపల శ్రీనివాస్ గుప్తలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రపంచ వ్యాప్తంగా వైద్యరంగం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయ మార్గాలు లేవని మానవతా దృక్పథంతో ముందుకు వచ్చే రక్త దాతల సహకారంతో మాత్రమే రక్తాన్ని అందజేయగలమని అన్నారు అలాంటి రక్తదాతలు కామారెడ్డి జిల్లాలో ఎక్కువ సంఖ్యలో ఉండడం దేశానికి గర్వకారణం అని అన్నారు కామారెడ్డి స్ఫూర్తిని దేశవ్యాప్తంగా తీసుకొని యువత రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించుకుని ప్రాణదాతలుగా నిలవాలని అన్నారు.