18-08-2025 08:18:15 PM
నిర్మల్,(విజయక్రాంతి): కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సర్దార్ పాపన్న గౌడ్ సామాజిక న్యాయం కోసం పోరాడిన మహనీయుడని కలెక్టర్ పేర్కొన్నారు. కుల, వర్గ భేదాలు లేకుండా సమానత్వాన్ని నమ్మిన పాపన్న గౌడ్ బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక సమానత్వానికి విశేష కృషి చేశారని తెలిపారు. రైతుల హక్కుల కోసం పోరాడి, ప్రజల్లో ఆత్మగౌరవం, ధైర్యస్ఫూర్తి నింపారని, పాపన్న గౌడ్ పేరు నేటికీ సమానత్వం, పోరాటస్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు.