calender_icon.png 18 August, 2025 | 10:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అక్రమ అరెస్టులు దారుణం

18-08-2025 08:34:25 PM

బిజెపి నాయకుల మండిపాటు

బెజ్జూర్(విజయక్రాంతి): మండలంలోని బిజెపి నాయకులను సోమవారం తెల్లవారుజామున పోలీసులు అదుపులో తీసుకున్నట్లు బిజెపి నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ... ఉదయం తెల్లవారు జామున 4 గంటలకు అక్రమ అరెస్టు చేసి బెజ్జూర్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగిందని అన్నారు.

భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలను, పోడు రైతులను అరెస్ట్ చేసి వందలాది కిలోమీటర్ల దూరంలో వారిని వేరువేరు పోలీస్ స్టేషన్లో తరలించడం చాలా బాధాకరం వారిని వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన వారందరిని విడుదల చేయాలని శాంతియుత నిరసనకు ఆవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పోడు రైతులతో కలిసి ఫారెస్ట్ అధికారులపై ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకువెళ్తామని ప్రజల ఆగ్రానికి గురికాక తప్పదని హెచ్చరించారు.కాంగ్రెస్ నాయకులు ఫారెస్ట్ అధికారులు పోడు భూములు గుంజు కోవాలని చూస్తున్నారని వారి ఆటలు ఇక సాగవని అన్నారు.