18-08-2025 08:05:03 PM
రాజగోపాల్ రెడ్డి ని విమర్శించే స్థాయి నీకు లేదు కుసుకుంట్ల
అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే
ఖబర్దార్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
చండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ధోటి నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు
మునుగోడు,(విజయక్రాంతి): వసతి గృహాలను చదువుకుంటున్న పేద పిల్లల కడుపు కొట్టి జేబు నింపుకున్న హీనమైన చరిత్ర నీది.. తన సొంత ఖర్చులతో ప్రభుత్వ విద్యాలయాలలో చదివే పిల్లలకు మౌలిక సదుపాయాలు కల్పించే గొప్ప చరిత్ర రాజగోపాల్ రెడ్డి దని ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి నీకు లేదని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పై చండూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ధోటి నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు విరుచుకపడ్డారు. సోమవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాసేవే పరమావధిగా, తన తుది శ్వాస వరకు మునుగోడును అభివృద్ధి చేయాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న రాజగోపాల్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తే నియోజకవర్గ ప్రజలు చూస్తూ ఊరుకోరని వెంటాడి వేటాడి కొడతారని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆయన అనుచరులు రాజ్ గోపాల్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేసిన దానిని తీవ్రంగా ఖండించారు.మునుగోడు కు సేవ చేయాలనే తలంపుతో 2018లో టిఆర్ఎస్ గాలి దృఢంగా వీస్తున్న తరుణంలోనే ఇక్కడి నుండి గెలుపొంది చరిత్ర సృష్టించారని అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి విషయంలో ఏ పార్టీ వాళ్లు కాంట్రాక్టు పనులు చేసినా కూడా బిల్లులు ఇప్పిస్తున్న చరిత్ర రాజగోపాల్ రెడ్డి దని.మీరు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మేము అభివృద్ధి పనులు చేస్తామంటే కనీసం శిలాఫలకం వేయడానికి కూడా ఒప్పుకోలేని నీచపు బుద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ది అని గుర్తు చేశారు.
తమరు ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి చేయకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుంటే తన పదవిని త్యాగం చేసి ప్రభుత్వాన్ని నియోజకవర్గ ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అభివృద్ధి చేసిన ఘనత రాజగోపాల్ రెడ్డి దని అన్నారు.సర్పంచులపై ఎంపిటిసిలపై కేసులు పెట్టించడం, భూకబ్జాలు చేయడం, ఎస్సై, సీఐ, ఎమ్మార్వోల వద్ద ముడుపులు తీసుకునే స్థాయి ఉన్న నువ్వు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే నైతికత లేదు. మీ అనుచరులు రాజగోపాల్ రెడ్డి గురించి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదని, తీరు మారకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.