calender_icon.png 20 February, 2026 | 3:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్రెగుట్టల్లో తుపాకుల మోత

20-02-2026 12:14:24 AM

  1. 5 వేల మంది సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్ బలగాల మోహరింపు

ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు హతం?

పార్టీ చీఫ్ దేవ్‌జీ లక్ష్యంగా ఆపరేషన్

రాయ్‌పూర్, ఫిబ్రవరి ౧౯ : ఛత్తీస్‌గఢ్‌లోని దట్టమైన కర్రెగుట్ట అటవీ ప్రాం తం గురువారం ఉదయం తుపాకుల మోతతో దద్దరి ల్లింది. మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ కీలక దశకు చేరుకోవడంతో.. బలగాలు తమ దాడులను ఉధృతం చేశా యి. సుమారు 5,000 మంది సీఆర్పీఎఫ్, కోబ్రా, గ్రేహౌం డ్స్, డీఆర్జీ బలగాలు ఏకకాలంలో అడవిని చుట్టుముట్టాయి.

పార్టీ కార్యదర్శి తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ ఈ ప్రాంతంలోనే తలదాచుకుంటున్నాడన్న పక్కా సమాచారంతో ఆపరేషన్ మొదలైంది. ఆపరేషన్‌లో ఎదురుకాల్పులు చోటుచేసుకుని ఐదుగురు మావోయిస్టులు మరణించినట్లు సమాచారం. మృతుల్లో మావోయిస్టు పార్టీకి చెందిన కీలక అగ్రనేతలు ఉన్నట్లు తెలిసింది. ములుగు జిల్లా వెంకటాపురం మం డల సరిహద్దుల్లోని డోలి-జెల్లా అటవీ ప్రాం తంలో ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.

ఘటనా స్థలం లో జవాన్లు భారీగా ఆయుధా లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఎన్‌కౌంటర్ నేపథ్యంలో భద్రాద్రి, ములుగు జిల్లా పోలీసులు ఆయాచోట్ల హైఅలర్ట్ ప్రకటించారు. మరోవైపు, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 300 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని వారి కదలికలు ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌తోపాటు తెలంగాణలో ఉన్నాయని సీఆర్పీఎఫ్ వర్గాలు వెల్లడించాయి.

అలాగే పార్టీ సెంట్రల్ కమిటీలోనూ నలుగురు సభ్యులు మాత్రమే మిగిలారని స్పష్టం చేశాయి. పార్టీ అగ్రనేతలు గణపతి, దేవ్‌జీ, మల్లా రాజారెడ్డి, మిసిర్ బెస్రాను పట్టుకోవడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని తెలుస్తోంది. ఈపరిణామాలన్నింటి నీ చూ స్తుంటే.. మార్చి ౩౧లోపు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు భారత్ నక్సల్ విముక్త దేశం అవుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి.

కాల్వపల్లిలో కలవరం 

కర్రెగుట్ట ఎన్‌కౌంటర్‌తో ములుగు జిల్లా తాడువాయి మండలం కాల్వపల్లిలో కలకలం రేగింది. ఆ గ్రామం మావోయిస్టు పార్టీ అగ్రనేత దామోదర్ అలియాస్ బడే చొక్కారావు స్వస్థలం. ఆయన కోసం కొద్దిరోజులు గా భద్రతా బలగాలు కూంబింగ్ చేస్తున్నాయి.

మేడారం అటవీ ప్రాంతంలో దామోదర్ షెల్టర్ తీసుకున్నారన్న పక్కా సమాచారంతో కూంబింగ్ చేస్తున్నట్లు సమాచారం. మృతుల్లో ఎవరెవరు ఉన్నారనేది తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ పోలీస్ ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.