20-02-2026 12:13:10 AM
జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం
ముషీరాబాద్, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి): ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే జెడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నిక లకు వెళ్లాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చత్రపతి శివాజీ మహారాజ్ 196వ జయంతిని ఘనం గా జరుపుకున్నారు.
ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జాతీయ బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ తో కలిసి గుజ్జ సత్యం మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో బీసీలు 61 శాతం గెలిచి బీసీల సత్తా చాటారని గుర్తు చేశారు. 42% బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్పి 32 శాతంకు కుదించి మోసం చేసిందన్నారు.
అయినప్పటికిని బీసీలు మున్సిపల్ ఎన్నికల్లో 61% గెలుచుకొని కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యాకే ఎన్నికలకు వెళ్లాలని అన్నారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు 61% గెలుపొంది ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని అన్నారు. ఈ సమావేశంలో ఓయూ బిసి జేఏసీ నేత రాజు, వలస సుభాష్ చంద్రబోస్, చీరాల వంశీ నేత, ప్రవీణ్ కుమార్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.