11-07-2025 12:00:00 AM
వేడుకల్లో పాల్గొన్న పీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌గుప్తా
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): నాగోల్‌లోని జైపూరి కాలనీ లో గల సాయిబాబా దేవాలయంలో గురువారం గురుపూర్ణిమ వేడుకలు నిర్వహించా రు. ఈ వేడుకల్లో పీసీసీ ప్రధాన కార్యదర్శి, అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, ఐవీఎఫ్ ప్రధమ మహిళ ఉప్పల స్వప్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భగా శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ.. సాయినాధుడి ఆశీస్సులు అందరి మీదా ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కొలను వెంక ట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రంజిత్, రాములు, సోమయ్య, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.