11-07-2025 12:00:00 AM
హాజరైన మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 10 (విజయక్రాంతి): గురుపౌర్ణమిని పురస్కరించు కొని హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆర్‌అండ్‌బీ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వేడుకల్లో రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. ఆర్‌అండ్‌బి శాఖ స్పెషల్ సీఎస్ వికాస్‌రాజ్‌తో కలిసి పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. గురు పౌర్ణమి రోజున తన శాఖ ఉద్యోగులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల మంత్రి వారిని అభినందించి, గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రేమ్, ఆర్ అండ్ బి శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.