calender_icon.png 11 July, 2025 | 8:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రెడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో

11-07-2025 12:00:00 AM

ఆగస్టు 15 నుంచి హైటెక్స్‌లో..  

ఖైరతాబాద్, జూలై 10: దేశంలోని ప్రైవేట్ రియల్ ఎస్టేట్ అభివృద్ధిదారుల అత్యున్నత సంస్థ అయిన కాన్ ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(క్రెడాయ్) హైదరాబాద్ శాఖ ఆధ్వర్యం లో ఆగస్టు 15 నుంచి మూడు రోజులపాటు హైటెక్స్ హాల్స్‌లో ‘ఎంచుకోవాల్సింది మీరే’ అనే థీమ్‌తో హైదరాబాద్ ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నట్లు తెలిపింది.

ఈ మేరకు గురువారం బంజారాహిల్స్‌లోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. అనంతరం క్రేడాయ్ హైదరాబాద్ శాఖ అధ్యక్షుడు జైదీప్‌రెడ్డి, ఎలక్టెడ్ అధ్యక్షుడు జగన్నాధ రావు, ప్రధాన కార్యదర్శి క్రాంతి కిరణ్, కన్వీనర్ శ్రీనాథ్, సహ కన్వీనర్ అరవింద్ రావు మాట్లాడారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం బలమైన స్థిరత్వాన్ని, దృఢమైన భవిష్యత్తు దృక్పథాన్ని చూపిస్తుందని అన్నారు.

మే నెలలో 4300 కోట్ల విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్ జరగడం ద్వారా సంవత్సరాను క్రమం గా 14శాతం వృద్ధి నమోదయిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా తులచిపో తున్న పరిస్థితుల్లో కూడా గ్లోబల్ పెట్టుబడిదారులకు హైదరాబాద్ మొదటి ఎంపికగా నిలు స్తుందని తెలిపారు. ఈ సంవత్సరం క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో కేవలం రియల్ ఎస్టేట్ ప్రదర్శన మాత్రమే కాకుండా ఎంపిక, నమ్మకం, సమాజ బంధానికి సంకేతం గా నిలుస్తుంది అని తెలిపారు.

ఈ ప్రాపర్టీ షోలో 70 కి పైగా ప్రతిష్టాత్మక క్రెడాయ్ డెవలపర్లు ఒకే  వేదికపై భాగస్వాములు అవుతున్నారని తెలిపారు. సాధారణ అపార్ట్మెంట్ ల నుంచి లగ్జరీ విల్లాలు, నిర్మాణంలో ఉన్నవి రెడీ టు మూవ్ ఇన్ ప్రాజెక్టుల వరకు అన్ని ఈ ప్రాపర్టీ షో లో ప్రదర్శించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ కార్యవర్గ సభ్యులు మనోజ్ కుమార్ అగర్వాల్, అనిల్ రెడ్డి, రవి ప్రసాద్, నితీష్ రెడ్డి, సంజయ్ కుమార్, శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.