15-05-2025 12:00:00 AM
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరానికి దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు గురుకుల కార్యదర్శి డాక్టర్ వీఎస్ అలగు వర్షిణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 15 చివరి తేదీ ఉండగా, తాజాగా మరో ఐదు రోజుల పాటు అవకాశం కల్పించినట్టు ఆమె పేర్కొన్నారు.