11 May, 2026 | 8:41 AM

నారాయణ ఆల్‌టైం రికార్డు

25-04-2024 01:02 AM

హైదరాబాద్, ఏప్రిల్ ౨౪ (విజయక్రాంతి): ఇంటర్ ఫలితాల్లో నారాయణ  విద్యార్థులు  సత్తాచాటారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ౪౬౯ మార్కులతో పులిగిళ్ల జాహ్నవి స్టేట్ ఫస్ట్, సీనియర్ ఎంపీపీ విభాగంలో ౯౯౩ మార్కులు ముగ్గురు విద్యార్థులు సాధించారని నారాయణ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్  పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ తెలిపారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో ౯౯౪ మార్కులు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో ౭౪ మంది ౪౬౮, ౫౩౦ మంది ౪౬౭మార్కులు, ౧౧౦౨ మంది ౪౬౬ మార్కులు సాధించారని చెప్పారు.  సీనియర్  ఇంటర్ ఎంపీసీ విభాగంలో ముగ్గురు విద్యార్థులు ౯౯౩ మార్కులు కైవసం చేసుకున్నారని వెల్లడించారు.

౧౦ మంది ౯౯౨ మార్కులు, ౨౯ మంది ౯౯౧ మార్కులు , ౫౧ మంది ౯౯౦ మార్కులు సాధించారని వివరించారు. జూనియర్ బైపీసీలో ఆరుగురు విద్యార్థులు ౪౩౮ మార్కులు సాధించారని పేర్కొన్నారు. ౩౨ మంది ౪౩౭ మార్కులు, ౪౦ మంది ౪౩౬ మార్కులు, ౪౪ మంది ౪౩౫ మార్కులు పొందారని వెల్లడించారు. సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కులు ౯౯౪ తమ విద్యార్థి సాధించారని స్పష్టంచేశారు, ఇంటర్ హెచ్‌పీజీలో ౪౭౫ మార్కులకు ఒకరు ౪౭౧, ఇద్దరికి ౪౭౦ మార్కులు వచ్చినట్టు తెలిపారు. సీనియర్ ఇంటర్ హెచ్‌పీజీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు ౯౮౪ మార్కులు సాధించారని వెల్లడించారు. ఆరంభం నుంచి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం, పటిష్ట మైక్రో షెడ్యూల్స్‌గా రూపొందించి కాన్సెప్ట్ ఓరియంటేషన్‌లో బోధించడం ద్వారానే ఈ ఫలితాలు సాధించినట్టు వెల్లడించారు.