calender_icon.png 6 May, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగం చేసిన వడగండ్ల వాన

05-05-2025 02:44:29 AM

కొనుగోలు కేంద్రాల్లో సైతం నీరు చేరి తడిసి ముద్దయిన ధాన్యం 

నిజామాబాద్ మే 4(విజయ క్రాంతి): ఉమ్మడి జిల్లాలో కురిసిన వడగండ్ల వాన రైతాంగాన్ని గందరగోళానికి గురి జేసింది. కామారెడ్డి ఎల్లారెడ్డి  ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం గంటపాటు ఉరుములతో కూడిన భారీ తెల్లవాన  కురిసింది. దాదాపు రెండు గంటల పాటు కురిసిన వర్షం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల తోపాటు, కల్లా ల్లో ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది.

వర్షపు నీటి ప్రవాహానికి వరద కాలువల్లో కి ధాన్యం కొట్టుకుపోయింది. రైతులు టార్పా లిన్ కవర్లు కప్పి ధాన్యం రక్షించుకోవడానికి ప్రయత్నించారు. లింగంపేట. మండలం లోని భవానీపేట జల్దిపల్లి, రాంపూర్, తదితర గ్రామాల్లో వడగండ్ల వర్షం కురి సింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు చేతికొచ్చిన పాణ్యం తవముందే వడగళ్ళ వర్షానికి గురై పోవడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అడగండ్ల వాన ఆగం చేసింది

 వడగండ్ల వాన..

చిన్నమల్లారెడ్డిలో ధాన్యం కాపాడుకు నేందుకు రైతన్న తీవ్ర అవస్థలు పడ్డారు. చిన్న మల్లారెడ్డిలో ధాన్యం కాపాడుకు నేందుకు రైతన్నలు పడిన బాధలు వర్ణతీతం లింగంపేటలో ధాన్యం కుప్పల చుట్టూ  వర్షం నీరు చేరి ధాన్యం తడిసి ముద్దయింది. ఇందల్వాయి మండలంలోని సిర్నాపల్లి గ్రామంలో ఆదివారం వడగళ్ల వాన కురియడంతో ధాన్యం తడిసి ముద్దయింది.

ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా రైతులు ధాన్యం కాపాడుకునేందుకు అవస్థలు పడ్డారు. సిర్నాపల్లి లో ధాన్యం కుప్పల చుట్టూ నిలిచిన వర్షం నీరు చేరుకోవడంతో రైతులు తీవ్రంగా నష్టం కలిగింది. ధర్పల్లి మండలంలోని నడిమి తండాలో ఆదివారం సాయంత్రం కురిసిన వడగళ్ల వాన తో ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి.

కామారెడ్డి,  (విజయ క్రాంతి): వడగండ్ల వాన రైతుల ఆగం చేసింది. ఆదివారం సాయంత్రం కురిసిన వడగండ్ల వాన ధాన్యా న్ని ఆరబోసిన రైతుల నుఆగం చేసింది. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్మెందుకు తెచ్చిన రైతులకు ధా న్యం ఆరబోశారు. ఆదివారం సాయంత్రం కురి సిన అకాల వడగండ్ల వర్షం రైతులను ఆగం చేసింది. ధాన్యం కాంట్రా పెట్టే సమ యానికి వర్షం పడడంతో ధాన్యం తడిసి ముద్ద యింది.

వడగండ్ల వాన గాలి దు మారం రావడంతో ధాన్యం వర్షం నీటి ఉధృతికి కొట్టుకపోవడం రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతు లు డిమాండ్ చేస్తున్నారు. కాంట పెట్టే సమయానికి వడ గండ్ల వర్షం రావడం రైతులను తీవ్ర ఆందో ళనకు గురిచేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.