05-05-2025 02:43:56 AM
కరీంనగర్, మే 4 (విజయ క్రాంతి): తమ తండ్రిని బ్రతికించుకోవడానికి ఇద్దరు చిన్నారులు పడుతున్న కష్టం చూసి చలించిపోయిన మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి వారికీ 10 వేల రూపాయల ఆర్ధిక సాయం చేసి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కరీంనగర్ జిల్లా శంకర పట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన లక్ష్మి నారాయణ మల్టీపుల్ ఆర్గన్ ఫెయిల్యూర్ తో 12 సంవత్సరాల నుండి మంచానికే పరిమితం అయ్యాడు.
ఆయన ఆరోగ్యం కోసం ఇళ్లు, బంగారం అమ్మి 15 లక్షలు ఆసుపత్రిలో ఖర్చు చేసారు. దీంతో లక్ష్మి నారాయణ భార్య మమత, ఇద్దరు ఆడ పిల్లలు ప్రవస్తి, ప్రశస్తి రోడ్డున పడ్డారు. ప్రస్తుతం ఆ నలుగురు కరీంనగర్ కిసాన్ నగర్ లోని ఓ చిన్న రేకుల షెడ్డులో తల దాచుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కొత్త జైపాల్ రెడ్డి వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు జైపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.