14 July, 2026 | 4:52 AM

లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రాల అందజేత

14-07-2026 12:47 AM

నాగిరెడ్డిపేట్, జులై 13 (విజయ క్రాంతి): మండలంలోని జప్తి జాన్కంపల్లి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రాలను గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వర్ అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వర్షిని పరమేశ్వర్ మాట్లాడుతూ...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కార్యక్రమంలో భాగంగా జప్తి జాన్కంపల్లి గ్రామంలో అర్హులైన లబ్ధిదారులు మహమ్మద్ ఆబెద బేగం ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో ఆమెకు ప్రభుత్వం నుండి మంజూరు అయినటువంటి పత్రాన్ని అందజేసినట్లు తెలిపారు.

అలాగే మంజూరైనటువంటి ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కొరకు మార్కింగ్ వేసి భూమి పూజ చేయడం జరిగిందన్నారు.అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి లబ్ధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో అక్కల వర్షిని పరమేశ్వర్, కార్యదర్శి శంకర్, ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.