1 September, 2026 | 10:15 PM

Breaking News

భూ రీ సర్వేను నిలిపివేయాలని గ్రామస్తుల ధర్నా   •   ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి   •   అశ్వాపురం రైస్‌మిల్‌ యజమాని అరెస్ట్‌   •   రేషన్ షాపుల ద్వారా బియ్యంతో పాటు చక్కెర కిరోసిన్ పంపిణీ చేయాలి   •   కార్పొరేట్ శక్తులకు పట్టం కడుతుం కేంద్ర ప్రభుత్వం   •   22ఏ భూముల వివరాలు పక్కాగా సిద్ధం చేయాలి   •   సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి   •   ఓపీఎస్‌ కోసం ఉద్యోగుల గళం.. నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   కరీంనగర్ జిల్లా గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులుగా నల్లగొండ తిరుపతి గౌడ్ నియామకం   •   ఉద్యోగులకు పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి   •  

ఐదు ట్రాన్స్‌ఫార్మర్లలో చోరీ.. రైతుల ఆందోళన

14-07-2026 | 12:45am

భిక్కనూర్, జూలై 13: భిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో, గుర్జకుంట గ్రామానికి చెందిన రైతుల వ్యవసాయ పొలాల్లో ఉన్న ఐదు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్, కాపర్ కాయిల్ను అపహరించారు. ఈ ఘటనతో ఆయా ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రైతులు సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంటలకు సకాలంలో నీరు అందక నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.

ఇలాంటి చోరీలు తరచూ జరుగుతున్నాయని, ట్రాన్స్ఫార్మర్ల వద్ద భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. అలాగే ధ్వంసమైన ట్రాన్స్ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని కోరారు. కొన్నిరోజుల క్రితం బస్వాపూర్ గ్రామంలో కూడా ట్రాన్స్ఫార్మర్ ను ధ్వంసం చేసి వాటిలోని ఆయిల్, కాపర్ కాయిల్ను దొంగిలించిన విషయం తెల్సిందే.

స్టార్టర్ చోరీ

భిక్కనూర్, జూలై 13(విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులో రైతు రాఘ రామ్రెడ్డి పొలంలో ఉన్న మోటార్ స్టార్టర్ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఆదివారం సాయంత్రం మోటార్ ఆన్ చేసి తాళం వేసి వెళ్లిన రైతు, సోమవారం ఉదయం వచ్చి చూడగా తాళం పగులగొట్టి అందులోని ఆటోమేటిక్ పరికరం, స్టార్టర్ను దొంగిలించినట్లు గుర్తించారు. ఇటీవల వ్యవసాయ పరికరాల చోరీలు పెరుగుతున్నాయని, పోలీసులు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.