13 May, 2026 | 1:31 AM

వైభవంగా హనుమాన్ జయంతి

13-05-2026 12:00 AM

మంగపేట, మే 12 (విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయం, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

శ్రీ భక్తాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఆలయ అర్చకులు ఈశ్వర్ చందుశర్మ, శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ప్రతాపురం శ్రీనివాసాచార్యులు, అర్చకులు ప్రతాపురం వంశీ కుమారాచార్యులు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సుప్రబాత సేవ, మహా గణపతి పూజ, పుణ్యహ వాచనం, పంచామృత అభిషేకం, సింధూర లేపనం, సహస్ర నాగవల్లి దళపూజ (తమలపాకులతో), హనుమత్ హోమం, పూర్ణాహుతి, మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.

హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా పచ్చని తోరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులు చేసిన జైశ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగాయి.