13 May, 2026 | 1:31 AM

భూ యజమానిని హత్య చేసిన కౌలు రైతు

13-05-2026 12:00 AM
  1. జీవిత ఖైదు విధించిన కామారెడ్డి కోర్టు 
  2. గంధం చెట్ల ఆశ కు భూ యజమానిని హత్య చేసిన కౌలు రైతు 
  3. కామారెడ్డి కోర్టు లో సంచలన తీర్పు 

కామారెడ్డి, మే 12 (విజయ క్రాంతి): భూ యజమాని ఆస్తిపై కన్నేసిన ఓ కౌలు రైతు భూ యజమానిని దారుణంగా హత్య చేశాడు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు పోలీస్ స్టేషన్ లో  కౌలు రైతుపై కేసు నమోదు కాగా విచారణ చేపట్టిన భిక్కనూర్   పోలీసులు భూ యజమానినీ హత్య చేసిన కౌలు రైతు ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసు పై కామారెడ్డి కోర్టులో న్యాయమూర్తి పూర్వాపరాలను పరిశీలించి భూ యజమానిని హత్య చేసిన కౌలు రైతుకు మంగళవారం కామారెడ్డి కోర్టులో న్యాయమూర్తి జీవిత ఖైదు విధించారు. కాట్రియల్ గ్రామానికి చెందిన కోరే సాయి జగదీష్ ముంబైలో ఉంటున్నాడు. అతని అన్న కూతురు పెళ్లి కోసం స్వగ్రామానికి వచ్చాడు.

తన భూమిని పదేళ్లుగా కౌలుకు ఇచ్చాడు. తన రెండెకరాల భూమిని అమ్మాలని భావించాడు. ఆ భూమిలో కౌలు రైతు కురుమ సాయిలు గంధం చెట్లు పెంచుతున్నారు. భూమి అమ్మ కానికి పెట్టడంతో తనకు భవిష్యత్తులో రావలసిన లాభం పోతుందని భావించిన సాయిలు పథకం ప్రకారం సాయి జగదీష్ ను హత్య చేయాలని పథకం పన్నాడు. 2022 నవంబర్ 13న జగదీషు కు మందు తాగుదామని నమ్మించి బైకుపై లక్ష్మాపూర్ కు తీసుకెళ్లారు.

మద్యం తాగిన తర్వాత భిక్కనూర్ ఎర్రగట్టు అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి మత్తులో ఉన్న జగదీష్ పై తలపై బండ రాయితో బాది హత్య చేశాడు. ఆనవాళ్లు లేకుండా శవాన్ని పట్టకుండా ఉండాలని ఉద్దేశం తో మృతదేహంపై దుస్తులు వేసి మద్యం పోసి నిప్పంటించాడు. మృతిని అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్న బిక్కనూర్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. సరైన సాక్షాలు సేకరించి నిందితుడు కుర్మా సాయి నారెస్టు చేసి చార్జీ షీట్ దాఖలు చేశారు.

సాక్షులు, వాంగ్మూల్యం, ఆధారాలను పరిశీలించిన కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్ నిందితుడు కుర్మా సాయి లు కు జీవిత ఖైది శిక్ష విధించడంతోపాటు 15 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ వ్యక్తిగత గొడవలు, ఆస్తి తగాదాల కారణంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే జీవితాంతం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులను, పబ్లిక్ ప్రాసిక్యూటర్, లను జిల్లా ఎస్పీ అభినందించారు.