20-05-2024 01:02:43 AM
గ్రామస్తులకు మౌలిక వసతులు కల్పిస్తాం..
రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఖమ్మం, మే 19 (విజయక్రాంతి): ప్రజాసమస్యల పరిష్కారం కోసమే ‘ప్రజలకు చెంతకు శీనన్న’ కార్యక్రమాన్ని చేపడుతున్నానని, తాను మాటల నేతను కాదని, చేతల నేతనని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో ఆదివారం ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. పల్లెగూడెం, పోలే పల్లి, గోళ్లపాడు, తీర్థాల, మద్దివారిగూడెం, పొలిశెట్టిగూడెంలో విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి గ్రామస్తుల సమస్యలను తెలుసుకున్నారు.
పలువురు ఇండ్ల స్థలాలకు పట్టాలు, విద్యుత్ సమస్యలు, అంతర్గత రహదారుల నిర్మాణంపై మంత్రికి వినతులు అందించారు. సమస్యలపై మంత్రి స్పందిస్తూ.. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. పార్టీలకు అతీతంగా అర్హలైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు. తొలుత ఆయన రూరల్ మండలంలోని మారెమ్మతల్లి ఆలయంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. పర్యటనలో పార్టీ నేతలు కళ్లెం వెంకటరెడ్డి, మద్దినేని స్వర్ణకుమారి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి,, మద్ది మల్లారెడ్డి, బండి జగదీష్, రామ్మూర్తినాయక్, భుజంగరెడ్డి, అశోక్‌నాయక్ తదిత రులు పాల్గొన్నారు.