14-07-2025 12:09:33 AM
పాల్గొన్న ఎమ్మెల్యే సంజీవరెడ్డి దంపతులు
నారాయణఖేడ్, జూలై 13: నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఆషాడం మాస బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రసిద్ధి చెందిన బోరంచ నల్ల పోచమ్మ ఆలయంలో బోనాల కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పి. సంజీవరెడ్డి దంపతులు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
కాగా ఎమ్మెల్యే సతీమణి అనుపమ సంజీవరెడ్డి బోనంతో ఆలయ చుట్టూ ప్రదక్షిణ చేశారు. నారాయణఖేడ్ పట్టణంలోని కట్ట మైసమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, బిజెపి నాయకులు ఎం. విజయపాల్ రెడ్డి, జన వాడ సంగప్ప, తదితరు నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, యువజన సంఘాల నాయకులు, స్థానిక గ్రామస్తులుపాల్గొన్నారు.