calender_icon.png 16 July, 2025 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనమెత్తిన చేవెళ్ల

14-07-2025 12:12:07 AM

చేవెళ్ల, జులై 13: చేవెళ్ల మున్సిపాలిటీ బోనాల శోభను సంతరించుకుంది. ఆదివా రం చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని చంద్ర రెడ్డి నగర్ కాలనీ, సాయి కృష్ణ కాలనీ, టీచర్స్ కా లనీ లో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు సిద్ధం చేసు కొని పోతరాజుల విన్యాసాలు, శివ సత్తుల శిగాల మధ్య ఊరేగింపుగా వచ్చి.. అమ్మవారిని నైవేద్యం సమర్పించారు. ఈ సంద ర్భంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య , ఆలయ కమిటీ చైర్మన్ దేవర సమతవెంకటరెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు.

అంతకుముందు ఎమ్మెల్యే చేవెళ్ల మండలం ఈర్లపల్లి గ్రామంలో పోచమ్మతల్లి విగ్రహప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మాలతికృ ష్ణారెడ్డి, ఈర్లపల్లి మాజీ సర్పంచ్లు ముత్తంగి రాజశేఖర్, శైలజాఆగిరెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ యాదగిరి, సీనియర్ నాయకులు సున్నపు వసంతం, వ నం మహేందర్రెడ్డి, గ్రామస్తులు, పార్టీ నాయకులుపాల్గొన్నారు.