14-07-2025 12:08:08 AM
కొండాపూర్ జూలై 13 : మండల పరిధిలోని కిష్టయ్య గూడెం ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద మల్కాపూర్ గౌడ కులస్తుల బోనాల ఊరేగింపు మహోత్సవంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం మల్కాపూర్ లోని నవజీవన్ శేషాద్రి నగర్ కాలనీలో కాలనీ వాసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బోనాల ఊరేగింపులో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కాలనీవాసులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు.ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో పట్నం మాణిక్యం, శివరాజ్ పాటిల్, చింతా గోపాల్ శ్రీధర్ రెడ్డి, విఠల్ తదితరులుపాల్గొన్నారు.