calender_icon.png 15 November, 2025 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా బాలల దినోత్సవం

15-11-2025 12:00:00 AM

మేడ్చల్ అర్బన్, నవంబర్ 14 (విజయ క్రాంతి):మేడ్చల్ మున్సిపల్ పట్టణ పరిధిలోని అత్వెల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం తో పాటు స్వయం పరిపాలన దినోత్సవాన్ని  నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యా యుడు మాణిక్యాలరావు మాట్లాడుతూ భారతదేశం యొక్క మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఒక్క జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన తర్వాత ఆయన జీవిత విశేషాలను విద్యార్థులకు తెలియజేయడం జరిగిందని చెప్పారు. అనంతరం పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులు శుక్రవారం ఉపాధ్యాయులుగా మారి పాఠశాలలో పాఠాలు బోధన చేయడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు వెల్లడించారు. 

ఈ నేపథ్యంలో  బాలలు యొక్క ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేసిన తర్వాత సాంస్కృతిగా కార్యక్రమాలు స్వయం పరిపాలన దినోత్సవం లో చక్కగా ఉపాధ్యాయులుగా బాధ్యతలు నిర్వహించినటు వంటి విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశామని ప్రధానో పాధ్యాయులు మాణిక్యాల రావు స్పష్టం చేశారు.   ఉపాధ్యాయులు గడప నవీన్. పద్మలత. వసి.రంగరావు. రాంబాబు. స్వరూప రాణి. ప్రభాకర్ విజయలక్ష్మి.సోనీ పాల్గొన్నారు.

బండరావిరాలలో..

అబ్దుల్లాపూర్‌మెట్, నవంబర్ 14: బండరావిరాల ప్రభుత్వ పాఠశాలలో చిల్డ్రన్స్ డే వేడుకలు ఘనంగా   నిర్వహించారు. చిల్డ్రన్స్ డే పురస్కరించుకుని గుండోజి రంగదాసు ఎడ్యుకేషన్ ట్రస్ట్ లోగోను వ్యవస్థాపకులు కందికంటి విజయ్‌కుమార్ ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులకు కంపిటిషన్‌నిర్వహించి.. ఎస్‌ఏ1 ఎగ్జామ్ టాఫర్‌కు నిలిచిన విద్యార్థులను సన్మానించారు. అదే విధంగా  200 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందజేశారు.

అనంతరం కందికంటి  విజయ్‌కుమార్ మాట్లాడుతూ.. గ్రామ విద్యదాత మొదటి గురువు గుండోజి రంగ దాసు పేర ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా హైస్కూల్, ప్రైమరీ స్కూళ్ల విద్యార్థులకు  స్టడీ మెటీరియల్స్ అందజేశారు.  హెచ్‌ఎం నర్సయ్య, ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం. ఆంజనేయులు, సుమలత, ఉపాధ్యాయులు, కందికంటి బిక్షపతి, కందికంటి దానేష్, మంకిరి యాదగిరి, కందికంటి జగన్, ఒంగూరి రమేష్, దుర్గాప్రసాద్, కందికంటి కృష్ణ, ఏర్పుల హరికృష్ణ, కందికంటి మధు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం మండలం

ఇబ్రహీంపట్నం, నవంబర్ 14: ఇబ్రహీంపట్నం మండలం ముకునూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు స్కూలు బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది. ఎంపీడీవో వెంకటమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజ్ కుమార్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్ సమస్త వారి విరాళంతో ప్రభుత్వ పాఠశాలను బలోపితం చేయడం లక్ష్యముతో పాలన దినోత్సవం సందర్భంగా పేద విద్యార్థులు అయిన ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి విద్యార్థులందరికీ వారి పుస్తకాల పట్టేంత వీలుగా బ్యాగ్స్ బ్యాగ్స్ పంపిణీ చేయడం జరిగింది.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజా, ఉపాధ్యాయులు హరికృష్ణ, అంగన్వాడీ టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

నేటి బాలలే రేపటి పౌరులు.. 

తాండూరు, 14 నవంబర్, (విజయక్రాంతి ) : నేటి బాలలే ...రేపటి పౌరులనీ ...దేశ భవిష్యత్తు  అంతా మీ చేతుల్లోనే ఉందని..రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షులు శంకర్ స్వామీజీ అన్నారు . బషీరాబాద్ మండలం దామర్చేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు . శ్రీ మాణికేశ సంస్థానం ట్రస్టు తరపున   35 మంది 10వ తరగతి విద్యార్థులకు జామెంట్రీ బాక్సులు పంపిణీ చేశారు.  పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.