01-01-2026 12:00:00 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, డిసెంబర్ 31 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలోని ప్రజలందరికీ 2026 సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో తమ అనుకున్న లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. యువత మత్తు పదార్థాల బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకుండా ఉన్నత చదువులు, ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని అందుకు అనుగుణంగా లక్ష్య సాధనకు కృషి చేయాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
జనవరి మాసంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతోందని, కొత్త సంవత్సరం నుండి ద్విచక్రవాహ నాలు నడిపే ప్రతి ఒక్కరు హెల్మెంట్ ధరించాలని, పరిమితికి మించి కూర్చోపెట్టు కోవడం, అతి వేగం, నిబంధనలకు విరుద్ధంగా మలుపులు తిరగటం వంటివి చేయ కుండా రోడ్డు భద్రత నియమాలు తూచ తప్పకుండా పాటించేందుకు కంకణం కట్టుకోవాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించే వాహనదారులపై కొత్త సంవత్సరం నుండి భారీగా జరిమానాలు ఉంటాయని హెచ్చరించారు.