01-01-2026 12:00:00 AM
కేసు నమోదు
కల్వకుర్తి టౌన్ డిసెంబర్ 31: కల్వకుర్తి పట్టణం ఇందీరనగర్ కాలనీలో నివాసం ఉంటున్న తిరుపతమ్మ వయస్సు 27 అనే మహిళ సోమవారం నుంచి కనిపించడం లేదని, ఆమె తల్లి చిత్తారి పరమేశ్వరమ్మ బుధవారం కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ మాధవరెడ్డి తెలిపారు. ఇటీవల భర్త ఆంజనేయులు తో గొడవపడి తల్లిగారిల్లు అయిన ఇందీరనగర్ కాలనీలో ఇద్దరు పిల్లలు తో కలిసి ఉంటుందని, రెండు రోజుల క్రితం పనికి వెళ్లి వస్తానని ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు ఎస్త్స్ర వివరించారు.