01-01-2026 02:19:52 AM
ఏఎంసీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి
బిచ్కుంద డిసెంబర్ 31 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవిత ప్రభాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతాన్ని సమీక్షించుకుంటూ, వర్తమానాన్ని విశ్లేషించుకుంటూ, భవిష్యత్తును అన్వయించుకుంటూ, మన జీవితాలను మరింత గుణాత్మకంగా తీర్చిదిద్దుకోవడం ద్వారానే నూతనత్వం సంతరిస్తుందని తెలిపారు.
నిర్దిష్ట లక్ష్యాలను రూపొందించుకుని యువత తమ ఆశయ సాధనకై ముందుకు సాగాలన్నారు. జీవితం పట్ల సరైన దృక్పథం, సంకల్ప బలం ఉంటేనే లక్ష్య సాధనలో సఫలీకృతులు అవుతారని పునరుద్ఘాటించారు. 2026 నూతన సంవత్సరంలో సరికొత్త ఆశలు, లక్ష్యాలతో ప్రజలు మరింత సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన గ్రామ ప్రజలకు ఆకాంక్షించారు. గ్రామ ప్రజలకు ప్రతిపక్ష నాయకులకు ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.