13 August, 2026 | 5:14 AM

హర్ ఘర్ తిరంగా.. ప్రతి ఇంటా దేశభక్తి

13-08-2026 12:00 AM

బోధన్, ఆగస్టు 12 (విజయ క్రాంతి): తిరంగా మన జాతీయ గౌరవానికి ప్రతీక.. దేశ ఐక్యతకు చిహ్నం బీజేపీ అధ్యక్షుడు సిర్ప సుదర్శన్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బోధన్ మండలం కల్దురికి గ్రామంలో బుధవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. బోధన్ మండల బీజేపీ అధ్యక్షుడు సిర్ప సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. తిరంగా మన జాతీయ గౌరవానికి ప్రతీక, దేశ ఐక్యతకు చిహ్నం. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. ప్రతి హృదయంలో దేశభక్తి నిండాలి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ, జాతీయ జెండా పట్ల గౌరవాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

కల్దురికి గ్రామంలో జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల మీదుగా ర్యాలీ కొనసాగింది. దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశ సేవ వంటి సందేశాలను ప్రజలకు చాటిచెప్పారు.

ఈ కార్యక్రమంలో కల్దురికి ఉపసర్పంచ్ జ్యోతి శంకర్, వార్డు సభ్యులు అశోక్, హన్మాండ్లు, రమేష్, రాజు, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మనోహర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు భాస్కర్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు న్యాలం శ్రీనివాస్, మండల ప్రధాన కార్యదర్శులు వెంకటేష్, లక్ష్మారెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, బీజేపీ సీనియర్ నాయకులు లచ్చప్ప, రాజన్న, బాబురావు, అశోక్, యువ నాయకులు పవన్, సంతోష్, బూత్ అధ్యక్షుడు శివతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, చిన్నారులు పాల్గొన్నారు.