తాడ్వాయిలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ
తాడ్వాయి,ఆగష్టు,12( విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం బిజెపి నాయకులు హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి పార్టీ కార్యాలయం నుంచి ఎల్లారెడ్డి కామారెడ్డి రోడ్డు మీదుగా గ్రామంలోని ప్రధాన వీధుల గుండా శ్రీ శబరిమాత ఆశ్రమం వరకు ర్యాలీ కొనసాగింది.ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గరిడే రవీందర్ రావు మాట్లాడుతూ... మండలంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మండలంలో సర్ ప్రక్రియ 100 శాతం పూర్తి చేయడం జరిగిందన్నారు.సర్ ప్రక్రియలో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించడానికి కృషి చేయాలన్నారు.
కొత్త లిస్టు వచ్చినప్పుడు ప్రతి బూతులో ఎవరైనా ఫేక్ ఓటర్స్ ఉన్నారా, రెండు ఓట్లు కలిగి ఉన్నారా అనే విషయాన్ని కార్యకర్తలు గమనించాలని సూచించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రధాన రోడ్డుపై గ్రామంలోని ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడువాయి మండలం బిజెపి అధ్యక్షులు వెల్మ సంతోష్ రెడ్డి, బిజెపి పార్టీ నాయకులు హోటల్ శ్రీను, వెంకట్రావు, లింగారావు, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






