మహిళా ఉద్యోగిపై వేధింపులు
వేధింపులు తాళలేక సీడీఎంఏకు ఫిర్యాదు
విచారణ జరపాలని కమిషనర్‌కు ఆదేశాలు
రాజేంద్రనగర్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మహిళా ఉద్యోగిణిలపై ఉన్నతాధికారి వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేయడం అందరినీ కలవరానికి గురి చేసింది. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిణిని ఓ ఉన్నతాధికారి వేధింపులకు గురి చేస్తున్నాడని మంగళ వారం సీడీఎంఏ అధికారిణి దివ్యకు ఫిర్యా దు చేసింది. స్పందించి ఆమె వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జల్‌పల్లి మున్సిపల్ కమిషనర్ ఉమను ఆదేశించింది. దీంతో మంగళవారం ఈ విషయపై మున్సిపల్ కార్పొరేషన్‌లో మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు విచారణ నిర్వహించారు. సుమారు గత పది నెల ల నుంచి తనను వేధిస్తున్నారని ఆ మహిళా ఉద్యోగిని ఫిర్యాదులో పేర్కొంది. ఈ సందర్భంగా ఉద్యోగిని మాట్లాడుతూ తాను చెప్పుకోలేక బాధపడేదాన్ని అని ఆవేదన చెందారు. ఎవరికీ చెప్పుకోలేక కిందిస్థాయి ఉద్యోగుల ముందు హేళనకుగురయ్యేదాన్ని అంటూ కన్నీటిపర్యంతమయ్యారు.






