మార్మోగిన ‘జైహనుమాన్’ నామస్మరణ

24-04-2024 01:59:40 AM

పార్టీలకతీతంగా పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు

సిద్దిపేట, ఏప్రిల్ 23 : హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం జిల్లా వ్యాప్తంగా జై హనుమాన్ నామస్మరణ మారుమోగిపోయింది. గజ్వేల్ పట్టణంలో హనుమాన్ భక్తులు శ్రీరాముడు, హనుమంతుడి భారీ విగ్రహాలతో శోభాయాత్ర ఘనం గా నిర్వహించారు. గజ్వేల్‌లో జరిగిన శోభాయాత్రలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎన్‌సి రాజమౌళి, మాజీ ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్నారు. అలాగే సిద్దిపేటలోని ప్రశాంత్‌నగర్ రావిచెట్టు హనుమాన్ ఆలయంలో హనుమాన్ దీక్షా స్వాములతో కలిసి హరీశ్‌రావు సహపంక్తి భోజనం చేశారు.

కర్మన్‌ఘాట్‌లో హనుమాన్ బైక్ ర్యాలీ

చంపాపేట డివిజన్‌లోని కర్మన్‌ఘాట్‌లో ధ్యానాంజనేయ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్, హిందూ వాహిని సభ్యులు పాల్గొన్నారు.

నారాయణఖేడ్‌లో...

కొండాపూర్ హనుమాన్ ఆశ్రమంలో హనుమాన్ జయంతి వేడుకలు ఆశ్రమ పీఠాధిపతి సంగ్రాం మహారాజ్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగాయి. 45రోజులుగా దీక్షలు చేపట్టిన మాలదారులు తమ దీక్షను మహారాజ్ ఆధ్వర్యంలో విరమించారు. జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్‌పట్లోళ్ల సంజీవరెడ్డి దంపతులు పాల్గొని భక్తు లకు అన్నం వడ్డించారు. జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు బీబీపాటిల్, సురేశ్ షెట్కార్ దంపతులు, నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి రాంమందిర్‌లోని హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

పటాన్‌చెరులో..

పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా జరిగాయి. పటాన్‌చెరు, రామచంద్రపురం పట్టణాలు, అమీన్‌పూర్, జిన్నారం, గుమ్మడిదల మండలల్లో హనుమాన్ జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వ హించారు. పటాన్‌చెరు పట్టణంలోని హనుమాన్ ఆలయాల్లో ఎమ్మెల్యే గూడెం మహి పాల్‌రెడ్డి పూజలు నిర్వహించారు.

హనుమాన్ ర్యాలీలో ఎమ్మెల్యే కుంభం

హనుమాన్ జయంతి భువనగిరి పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో భువనగిరి ఎమ్మేల్యే కుంభం అనిల్ కుమార్‌రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమా ర్‌రెడ్డితో కలిసి ప్రసాద పంపిణీని ప్రారంభించారు. భువనగిరి జిల్లా కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో హనుమాన్ విజయయాత్ర బైక్ ర్యాలీ వైభవంగా నిర్వహించారు.