24 March, 2026 | 8:42 AM

మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు

24-03-2026 12:00 AM

ప్రధాన కార్యదర్శిగా సయేందర్‌రెడ్డి 

మంథని మార్చి 23 (విజయ క్రాంతి) మంథని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా హరిబాబు, ప్రధాన కార్యదర్శులుగా సయేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.సోమవారం మంథని కోర్టు ఆవరణలో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా కెవిఎల్‌ఎన్, హరిబాబు, ప్రధాన కార్యదర్శిగా ముస్కుల సయేందర్ రెడ్డి,

ఉపాధ్యక్షులుగా కేతిరెడ్డి రఘోత్తం రెడ్డి, కార్యదర్శిగా కటుకం శ్రీనివాస్, కోశాధికారిగా సుభాష్, లైబ్రరీ కార్యదర్శిగా రాచర్ల రాజేందర్, సాంస్కృతిక కార్యదర్శిగా ఆర్ల నాగరాజు, ఎక్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా సైకం భాస్కర్ రెడ్డి, లోకే రాధాకిషన్, శ్రీలక్ష్మి, శభానా లు ఏకగ్రీవముగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సీనియర్ న్యాయవాది కూ సత్యనారాయణ తెలిపారు.