సమయం లేదు మిత్రమా.. సర్దుకుపోవాల్సిందే
05-05-2024 01:05 AM
సిద్దిపేట మే 4 (విజయక్రాంతి): జోరందుకున్న పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో సమయం లేదు మిత్రమా సర్దుకుపోవాల్సిందే అంటున్నారు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో రోడ్డుపక్కాన ఉన్న మొబైల్ టీఫిన్ సెంటర్ వద్ద ఆగి బీఆర్‌ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డితో కలిసి దోష తిన్నారు. జిల్లాలోని దుబ్బాకలో ప్రచారానికి వేళ్తున్న ఆయన రోడ్డు పక్కాన దోష తినడాన్ని స్థానికులు ఆసక్తిగా తిలకించారు. దోష బాగుంది అంటూ కితాబిచ్చారు.




