ఆసుపత్రి నుంచి వృద్ధురాలి ఓటింగ్
05-05-2024 01:08 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 4 (విజయక్రాంతి) : దవాఖానలో చికిత్స పొందుతున్నా ఓ వృద్ధురాలు ఓటు వేయడంలో తన బాధ్యతను మరవలేదు. ఎన్నికల అధికారులు చేపట్టిన హోమ్ ఓటింగ్‌లో భాగంగా ఆమె తన ఓటు హక్కును శనివారం వినియోగించుకుని ఆదర్శంగా నిలిచారు. పోలింగ్ రోజు సెలవు దినంగా భావించి, ఓటు హక్కు వినియోగించుకోకుండా అలసత్వం ప్రదర్శించొద్దని ఆమె అన్నారు.




