25-01-2026 01:53:32 PM
నంగునూరు,(విజయక్రాంతి): నంగునూరు మండలం అక్కెనపల్లి గ్రామంలో వెలసిన సమ్మక్క-సారలమ్మ జాతర మహోత్సవానికి రావాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావును గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజుల పాటు ఈ జాతర వైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ..భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతరాజు రేణుక రమేష్, ఆలయ కమిటీ సభ్యులు నాగారపు రాజయ్య, కనకయ్య, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.