calender_icon.png 25 January, 2026 | 4:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కెనడాలో భారత సంతతికి చెందిన వ్యక్తి హత్య

25-01-2026 03:03:51 PM

ఒట్టావా: కెనడాలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురయ్యారు. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రాంతంలో ముఠా ఘర్షణలు తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత సంతతికి చెందిన వాంకోవర్ నివాసి దిల్‌రాజ్ సింగ్ గిల్(28) గత వారం కెనడాలోని బర్నబీలో కాల్చి చంపబడ్డాడని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సిఎంపి) అధికారులు తెలిపారు. ఈ నెల 22న 3700 కెనడా వే లో కాల్పులు జరిగినట్ల పోలీసులకు సమాచారం అందింది.

వారు అక్కడికి చేరుకొనే సరికి అక్కడ ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు పోలీసులు గమనించి, అతడిని కాపాడేందుకు ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండాపోయింది. కాల్పుల స్థలం సమీపంలో పోలీసులు ఓ కాలిపోతున్న వాహనాన్ని గుర్తించమని, అది ఈ నేరానికి సంబంధించినదని భావిస్తున్నారు. ప్రావిన్స్‌లో వ్యవస్థీకృత ముఠా హింసకు సంబంధించి తప్పించుకోవడానికి ఉపయోగించిన వాహనానికి నిప్పు పెట్టడం వ్యూహమని అధికారులు వెల్లడించారు. గిల్ హత్యకు ఈ నెల ప్రారంభంలో అబోట్స్‌ఫోర్డ్‌లో జరిగిన నవప్రీత్ ధాలివాల్ హత్యతో సంబంధం ఉండవచ్చు.

28 ఏళ్ల ధాలివాల్ బ్రదర్స్ కీపర్స్ గ్యాంగ్‌లో సభ్యుడని ఆరోపణలు ఉన్నాయని, తన మరణ సమయంలో హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలపై బెయిల్‌పై ఉన్నాడు. గిల్‌కు మాదకద్రవ్యాలకు సంబంధించిన నేరాలలో గతంలోనూ శిక్షలు పడ్డాయని నివేదికలు సూచిస్తున్నాయి. వాటిలో తాజాది 2021లో జరిగిందని, అప్పుడు నార్త్ వాంకోవర్‌లో 2018లో జరిగిన అరెస్టుకు సంబంధించిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా నేరాలకు గాను అతనికి ఏకకాలంలో శిక్షలు విధించబడ్డాయి. నగదుతో పాటు, గిల్ వద్ద క్రాక్, హెరోయిన్-ఫెంటానిల్ మిశ్రమం లభించాయి. అతనిపై 2016 నాటి అదనపు అక్రమ రవాణా ఆరోపణలు, పోలీసుల నుండి పారిపోవడం వంటి మరికొన్ని ఇతర ఆరోపణలు ఉన్నాయి.