calender_icon.png 25 January, 2026 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాంపల్లి అగ్నిప్రమాదం.. మృతదేహాల వెలికితీత

25-01-2026 11:58:59 AM

హైదరాబాద్: నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఫర్నిచర్ దుకాణంలో అగ్నిప్రమాద జరిగింది. ఈ ఘటనలో చిక్కుకొని మరణించిన ఐదుగురు మృతదేహాలను భవనం సెల్లార్ నుంచి రెస్క్యూ టీమ్ వెలికి తీశారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిన్న మధ్యాహ్నం నుంచి హైడ్రా, పోలీసులు, ఫైర్ సిబ్బంది సహా 9 విభాగాల అధికారులతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నాంపల్లిలోని ఓ ఫర్నిచర్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్, హెచ్ ఫర్నిచర్ గోదాములో మంటలు చెలరేగి క్షణాల్లోనే  నాలుగో అంతస్తు వరకు వ్యాపించాయి. ప్రమాదం మొదట గ్రౌండ్ ఫ్లోర్లో సంభవించి, ఆపై నాలుగు అంతస్తులకు విస్తరించింది. భవనం లోపల వాచ్‌మెన్ కుటుంబంలోని ఇ ద్దరు చిన్నారులు, ముగ్గురు పెద్దలు చిక్కుకున్నట్లు సిబ్బంది గుర్తించారు. భవనాన్ని మంటలు, దట్టమైన పొగలు కమ్మేయడంతో ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.