25-01-2026 12:21:34 PM
హైదరాబాద్: ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని చంపాపేట డివిజన్ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ వంగ మధుసూదన్ రెడ్డి(55) శనివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నానక్ రామ్ గూడలోని స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్త విని చంపాపేటలోని బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆసుపత్రిలో మధుసూదన్ రెడ్డి భౌతిక దేహానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. ప్రజాసేవ ఎప్పుడు ముందుండే నాయకుడిగా గుర్తింపు పొందిన మధుసూదన్ రెడ్డి డివిజన్ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. మధుసూదన్ రెడ్డి అకలమరణం పార్టీకి తీరని లోటుగా మారిందని, చంపాపేట డివిజన్ ప్రజల్లో తీవ్ర విషాదని మిగుల్చిందని పలువురు నాయకులు తెలుపుతున్నారు. మధుసూదన్ రెడ్డి భౌతికకాయానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులర్పించి, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.