calender_icon.png 25 January, 2026 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు బహుమతులు అందజేత

25-01-2026 02:01:14 PM

కేసముద్రం,(విజయక్రాంతి): రిపబ్లిక్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలోని అమీనాపురం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో విజేతలకు గ్రామానికి చెందిన మేకల అశోక్ కుమార్ 2000 రూపాయల విలువైన బహుమతులను అందజేశారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించడానికి ఆటల పట్ల ఆసక్తి పెంచుకోవాలని ఈ సందర్భంగా అశోక్ కుమార్ విద్యార్థులకు ఉద్బోధించారు. పేద విద్యార్థులకు అశోక్ చేయూత అందించడం పట్ల పాఠశాల హెడ్మాస్టర్ పత్తి వీరస్వామి కృతజ్ఞతలు తెలిపారు.