calender_icon.png 25 January, 2026 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కురవి వీరభద్రుని సన్నిధిలో రథసప్తమి వేడుకలు

25-01-2026 01:44:01 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో స్వామి అమ్మవార్లకు రధ సేవ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉత్సవ విగ్రహాలను భక్తుల జయ జయ ద్వానాల మధ్య మంగళ వాయిద్యాలతో ఊరేగించారు. రథసప్తమి వేడుకలను పురస్కరించుకొని వీరభద్ర స్వామి దేవాలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు అనిల్ కుమార్, ఈవో శ్రావణపు సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.