జేబీఐఈటీ, బీఈసీలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఓరియంటేషన్
మొయినాబాద్,ఆగస్టు 5(విజయక్రాం తి): జేబీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అ ండ్ టెక్నాలజీ (జేబీఐఈటీ), భాస్కర్ ఇంజినీరింగ్ కాలేజ్ (బీఈసీ) సంయుక్తంగా 2026 విద్యా సంవత్సరంలో చేరిన ప్ర థమ సంవత్సరం బీటెక్ విద్యార్థులకు ఓరియంటేషన్ డే2026 కార్యక్రమాన్ని నిర్వ హించాయి. ఎంఎన్‌ఆర్ ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అకడమిక్ విధానం, క్యాంపస్ వాతావరణం, కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు.
డీఆర్డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ యు. రాజా బాబు ముఖ్య అతిథిగా పాల్గొని, ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కార్యక్రమంలో జేబీ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి జె.వి. కృష్ణారావు విద్యార్థులను స్వాగతించగా, యాంటీ ర్యాగింగ్, ప్లేస్మెంట్లు, పరీక్షల విధానం, స్టార్టప్ అవకాశాలపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు.






