calender_icon.png 3 June, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అందాల పోటీలకు వెళ్లిన సీఎంకు.. రైతుల దగ్గరకు వెళ్లే సమయం లేదా?

01-06-2025 02:20:40 PM

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(CM Revanth Reddy) బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Siddipet MLA Thanneeru Harish Rao) మరోసారి విమర్శలు సంధించారు. ఐదుసార్లు అందాల పోటీలకు వెళ్లిన ముఖ్యమంత్రికి.. రైతుల దగ్గరకు పోవడానికి సమయం లేదా?  అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు విందులు, వినోదాల కోసం అందాల పోటీలు పెట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల జేబులు నింపడానికే రాజీవ్ యువ వికాసం పథకం తెచ్చారని హరీశ్ రావు ఆరోపించారు. అందాల పోటీలకు వచ్చి ఓ యువతిని రేవంత్ రెడ్డి అనుచరులు ఇబ్బంది పెట్టారని ఆయన తెలిపారు. మిస్ ఇంగ్లాండ్ తన దేశానికి తిరిగి వెళ్లింది.. దీంతో రాష్ట్రానికి చెడ్డపేరు వచ్చిందని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీ(Miss World Competition) వల్ల ప్రజలకు మేలు జరుగుతుందా..? అని హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పదేండ్లలో కేసీఆర్ తెలంగాణను నిలబెడితే ఏడాదిన్నరలోనే రేవంత్ పడగొట్టిండని హరీశ్ రావు మండిపడ్డారు.