04-05-2025 06:34:08 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలోని కాల్వ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ పాలకవర్గాన్ని ప్రభుత్వం ఖరారు చేస్తూ దేవాదాయ శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్గా కే మహేందర్ తో పాటు మరో 12 మంది పాలకవర్గ సభ్యులను ఖరారు చేయడంతో సోమవారం ఆలయంలో ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్నట్టు తెలిపారు.