calender_icon.png 4 May, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంస్థ ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

04-05-2025 06:45:58 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని టీజీ ఎంపీడీసీలకు చెందిన ప్రభుత్వ భూమిని కొందరు ఆక్రమించుకున్నందుకు ప్రయత్నిస్తున్నారని ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని ఆ భూమి ఆక్రమణ గురికాకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఎంప్లాయిస్ యూనియన్ 11 0 4 యూనియన్ రీజియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీనివాసరాజు ఏ పోచయ్య డిమాండ్ చేశారు. ఎన్నో సంవత్సరాలుగా టీజీ ఎంపీడీసీఎల్ పరిధిలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఫేక్ సర్టిఫికెట్లతో కొందరు ఆక్రమించుకొని భవనాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని దీని యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

భూమి అక్రమ గురకకుండా జిల్లా కలెక్టర్ ఎస్పీలు జోక్యం చేసుకోవాలని లేకుంటే టీజీ ఎంపీడీసీఎల్ పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉద్యమాన్ని చేపడతామని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి విషయంలో అభ్యంతర తెలుపుతున్న తమపై కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నారని అటువంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలని సంఘం తరఫున డిమాండ్ చేశారు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.