04-05-2025 06:55:24 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ సమీపంలో ఇటీవల నిర్మల్ జిల్లా పెంబి మండలానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంఘటన నేపథ్యంలో ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్(MLA Vedma Bhojju Patel) వారి కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎంసెట్ పరీక్ష రాసి పెంబి మండలానికి తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన ఇద్దరు అక్క చెల్లెల కుటుంబాన్ని పరామర్శించి తీవ్ర సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆ కుటుంబానికి వెడమ ఫౌండేషన్ తరపున 20,000 ఆర్థిక సహాయం అందించి, మొదటి విడతలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తానని, కుటుంబానికి ఎల్లవేళలా తాను అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మ,న్ వైస్ చైర్మన్, పడిగల భూషణ్, అబ్దుల్ మాజీద్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజుర సత్యం, పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.