04-05-2025 06:30:52 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన తెలంగాణ ధూమ్ ధామ్ సృష్టికర్త అంతడుపుల నాగరాజును గద్దర్ అన్న ఐకాన్-2025 అవార్డు(Gaddar Anna Icon-2025 Award) అందుకున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తమ ఆట పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉదృతం చేసిన ప్రజా కవులను కళాకారులను గుర్తించి సాయి అలేఖ్య సాంస్కృతిక సంఘ సేవ సంస్థ ఆధ్వర్యంలో శనివారం బిర్లా ప్లానీటోరియంలోని భాస్కర ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Assembly Speaker Gaddam Prasad Kumar), ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాల చారి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి తెలంగాణ సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల గద్దర్, నిర్వాహకురాలు అలేఖ్యల చేతుల మీదుగా నాగరాజు అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా అవార్డ్ గ్రహీత మాట్లాడుతూ... ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్న అవార్డును అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.