calender_icon.png 4 May, 2025 | 11:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోతుల దాడిలో మహిళకు తీవ్ర గాయాలు

04-05-2025 06:15:35 PM

హుజురాబాద్ (విజయక్రాంతి): కోతుల దాడిలో మహిళకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని విద్యానగర్ లో ఆదివారం పుల్లూరి త్రివేణి అనే మహిళపై ఒకసారిగా కోతులు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

కోతుల బారి నుండి రక్షించండి..

ప్రాంతంలో కోతుల దాడులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఇంటి ముందు ఆడుకుంటున్నచిన్న పిల్లలపై దాడిచేసి గాయపరుస్తున్నాయని, ఇంట్లోకి వెళ్లి వస్తువులను ధ్వంసం చేయడం వంటివి నిత్యం జరుగుతూనే ఉన్నాయని మున్సిపల్ కమిషనర్ స్పందించి వెంటనే కోతుల బారి నుండి రక్షించాలని కోరుతున్నారు.