calender_icon.png 4 May, 2025 | 10:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థినికి చదువుల కోసం వెంపటి నరసింహారావు, అనసూయమ్మ జ్ఞాపకార్థంగా ఆర్థిక సహాయం

04-05-2025 06:01:58 PM

సిపిఐ పాల్వంచ పట్టణ కార్యదర్శి, ఎనిమిదో వార్డు మాజీ కౌన్సిలర్ అడుసుమల్లి సాయిబాబు..

పాల్వంచ (విజయక్రాంతి): ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం కాకూడదన్న లక్ష్యంతో సీపీఐ పట్టణ కార్యదర్శి అడుసుమల్లి సాయిబాబు విద్యార్థుల చదువులకు అయ్యే ఖర్చులను వారి అత్త, మామ అయినా వెంపటి నరసింహారావు, అనసూయమ్మ జ్ఞాపకార్ధంగా ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని రావి బుల్లయ్య అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని రాంనగర్ ప్రాంతానికి చెందిన బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న సురకాసుల మౌనిక పేద విద్యార్థి కావడంతో చదువులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి రావి బుల్లయ్య చేతుల మీదుగా విద్యార్థి తల్లిదండ్రులకు రూ 10 వేలు అందజేశారు.

ఈ సందర్బంగా బుల్లయ్య మాట్లాడుతూ.. అడుసుమల్లి సాయిబాబు అనేకమంది పేద విద్యార్థులకు సాయం చేయడం గొప్ప విషమన్నారు. పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు పడకూడదని నాలుగు సంవత్సరాలకు గాను ప్రతి సంవత్సరం రూ 10 వేలు రూపాయల సహాయం అందజేయడం చాలా సంతోషకర అన్నారు. ఈ సందర్భంగా సాయిబాబును  ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు శనగారపు శ్రీనివాసరావు, శేఖర్ బాబు, లాల్ పాషా, పద్మ, లక్మి, బాను, శంకర్, శ్రీనివాస్, వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.