రైతులంతా హైదరాబాద్‌కు వచ్చి ఉద్యమం చేస్తామంటున్నారు: హరీశ్ రావు
23-05-2024 11:27 AM
కొడిమ్యాల: ధాన్యం విక్రయం కోసం రైతులు నెలరోజులుగా ఎదురుచూస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో హరీశ్ రావు గురువారం పర్యటించారు. పూడూరులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీశ్ రావు పరిశీలించారు. అక్కడ రైతు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. క్వింటాల్ వడ్లకు రూ. 100, రూ.200 తక్కువకు అమ్ముకుంటున్నారని హరీశ్ రావు తెలిపారు. గత ప్రభుత్వం 67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్న మాజీ మంత్రి ప్రస్తుతం 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే కొన్నారని విమర్శించారు. రైతులంతా హైదరాబాద్ కు వచ్చి ఉద్యమం చేస్తామంటున్నారని తెలిపారు.






